Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 10:25:53
facebook Twitter Googleplus
Photo

మురుగుదాస్.. మహేశ్ కాంబినేషన్లో వస్తున్న స్పైడర్. ఈ సినిమా టీజర్ విడుదల ముందు వరకూ ఉన్న అంచనాలకు.. తర్వాతకూ టోటల్ గా సీన్ మొత్తం మారిపోయింది. మొదట్లో ఈ సినిమాను గూఢాచారి సినిమాగా చాలామంది భావించారు. మురుగుదాస్ టచప్ తో రిచ్ గా మూవీ ఉంటుందని అనుకున్నారు. అయితే.. ఆ అంచనాలన్నీ తాజాగా విడుదలైన టీజర్ తో మారిపోయాయి.

ఇదో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ అనే ప్రచారానికి ఊతం ఇచ్చేలా టీజర్ ఉండటంతో దీనిపై అంచనాలు మరింత ఎక్కువైపోయాయి. జేమ్స్ బాండ్ తరహా మూవీకి అద్భుతమైన గ్రాఫిక్స్ ను జోడించి.. దీన్నో సాంకేతిక అద్భుతంగా మురుగుదాస్ తీర్చిదిద్దుతున్నారన్న మాట వినిపిస్తోంది.

తాజా టీజర్ దెబ్బకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలన్నీ అమాంతం పెరిగిపోయాయి. తెలుగు ప్రేక్షకులనే కాదు.. ఇటు తమిళ్.. అటు హిందీ ప్రేక్షకుల కన్ను తాజా టీజర్ మీద పడిందని చెబుతున్నారు. టీజర్ మీద వచ్చిన బజ్ తో బాలీవుడ్ ఒక్కసారి అలెర్ట్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది ఈ సినిమా రానున్న రోజుల్లో మరో సంచలనంగా మారుతుందన్న అంచనాను బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. మరికొందరు మాత్రం టీజర్ లో ఏముందని అంత ఇదైపోవటానికి.. అంతా హైప్ అని కొట్టిపారేస్తున్నా.. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ టీజర్ కు 50 లక్షల వ్యూస్ రావటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఏమైనా.. తాజా టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేయటమే కాదు.. బాలీవుడ్ కన్ను పడేలా చేయటంలో మురుగుదాస్ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.

,  ,  ,  ,