Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 11:51:14
facebook Twitter Googleplus
Photo

కుర్ర హీరోయిన్ రాశిఖన్నాకు గ్లామర్ యాంగిల్ లో మంచి పేరే ఉంది కానీ.. ఇప్పటి వరకూ డ్యాన్సర్ అని మాత్రం అనిపించుకోలేదు. కానీ సడెన్ గా ఈ భామకు విపరీతంగా డ్యాన్సులు చేసేయాల్సిన అవసరం వచ్చింది. అది కూడా మెగా వారసుడి పక్కన.. మెగాస్టార్ సాంగ్ కి డ్యాన్స్ చేయడమంటే.. చుక్కలు కనిపించాయట రాశికి.

త్వరలో విడుదల కానున్న సాయిధరం మూవీ సుప్రీమ్ లో.. 'సుప్రీం హీరో' సాంగ్ కి డ్యాన్సులు వేసింది రాశి ఖన్నా. మెగా సుప్రీం స్టార్ కి పోటీగా రాశి వేసిన స్టెప్స్ కు ఇండస్ట్రీ జనాలతో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటను చేసే ముందు చాలానే రిహార్సల్స్ చేసిందట రాశి. 'ఈ పాటను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. చిరు సార్ డ్యాన్స్ మూమెంట్లు చూసి స్టన్ అయిపోయాను. రాధ కూడా ఆయనతో సమానంగా స్టెప్స్ వేశారు. డ్యాన్స్ ట్యాలెంట్ చూపించేందుకు ఇదో చక్కటి సాంగ్' అంటోంది రాశి ఖన్నా.

'ఇలాంటి సూపర్ హిట్ సాంగ్ లో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. నాకు డ్యాన్స్ అంటే ఇష్టమే కానీ.. చిరు రాధలతో మ్యాచ్ చేయడం అంటే చాలా కష్టం. ఎక్స్ ప్రెషన్స్ - బాడీ లాంగ్వేజ్ కోసం చాలాసార్లే రిహార్సల్స్ చేసి ఈ పాటను షూట్ చేశాం. ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే తెగ సంతోషంగా ఉంది' అని చెప్పింది రాశిఖన్నా. ట్రైలర్ - సాంగ్ ప్రోమోల్లో చూపించనవరకూ అయితే.. ఈ భామ డ్యాన్స్ ఇరగదీసేసింది. మరి మొత్తం సాంగ్ లో ఏ రేంజ్ లో ట్యాలెంట్ చూపించిందో రాశి!!

,  ,  ,  ,  ,  ,  ,