Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 12:51:19
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్లో ఇప్పుడున్న నెంబర్ వన్ మాస్ డైరెక్టర్ ఎవరు అంటే బోయపాటి శ్రీను పేరు చెప్పేయొచ్చు. మాస్ సినిమాలు తీయడంలో అతడికి తిరుగులేదు. ఐతే బోయపాటి బన్నీ లాంటి క్లాస్ టచ్ ఉన్న హీరోతో సినిమా చేస్తున్నాడనగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. పైగా ఈ సినిమాకు అల్లు అరవిందే నిర్మాత కూడా కావడంతో ఈ సినిమా ఏ తరహాలో ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. బన్నీకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ. పిల్లలు.. క్లాస్ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అతనో సినిమా చేస్తుంటే వీళ్లందరినీ కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలో బోయపాటి తన శైలి మార్చుకుంటాడేమో.. బన్నీ స్టయిల్లోనే సినిమా తీస్తాడేమో అనుకున్నారంతా.

కానీ ?సరైనోడు? చూస్తే ఇది పక్కా బోయపాటి మార్కు సినిమా అని తేలిపోయింది. బోయపాటి శైలికి తగ్గట్లు బన్నీ తనను తాను మార్చుకున్నాడు తప్ప.. బన్నీ కోసం బోయపాటి పెద్దగామార్పులేమీ చేసుకోలేదు. అల్లు అరవింద్ ను కూడా ఒప్పించి తనదైన శైలిలో బోయపాటి సినిమా తీయడం చిత్రమే. ఐతే మాస్ లో బన్నీకి ఫాలోయింగ్ పెంచడానికి కూడా దీన్ని ఒక అవకాశంగా భావించారేమో. ఇక ?సరైనోడు? సగటు ప్రేక్షకుడికి ఓ మోస్తరు సినిమాలా అనిపిస్తున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కు మాత్రం విందు భోజనంలాగే అనిపిస్తోంది. పాత కథే తిప్పి కొట్టడం నిరాశ పరిచినా.. బన్నీని పూర్తిస్థాయి మాస్ హీరోగా ప్రెజెంట్ చేసిన తీరు.. మాస్ హీరోయిజం పండించిన వైనం.. ఆ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. బి.. సి సెంటర్లలో సినిమా ఇరగాడేయడం ఖాయం కాబట్టి బోయపాటి మరోసారి బాక్సాఫీస్ జర్నీని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఐతే తన తర్వాతి సినిమా నుంచి మాత్రం అతను కథలు మార్చకుంటే కష్టం.

,  ,  ,  ,  ,  ,