Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 10:50:28
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్న యంగ్ హీరో నితిన్. ఇప్పుడీ కుర్రాడు తన కెరీర్ లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తొలి సినిమా జయం విడుదలై 14 ఏళ్లు గడించిందంటూ ట్వీట్ చేసిన నితిన్.. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

'14 ఏళ్ల క్రితం జూన్ 14న నేను ఈ ప్రపంచానికి జయం సినిమా ద్వారా వెంకట్ గా పరిచయం అయ్యాను. ఇదో అద్భుతమైన ప్రయాణం. తేజ సార్ కి థాంక్యూ. నాకు అండగా నిలిచిన ప్రతీ అభిమానికీ కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశాడు నితిన్. 2002లో జూన్ 14న విడుదలైన జయం ద్వారా.. నితిన్ అరంగేట్రం జరిగింది. ఆ సినిమా హిట్ తర్వాత.. వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చి దిల్.. నితిన్ ని టాలీవుడ్ లో స్థిరపడేలా చేసింది. 2004లో వచ్చిన రాజమౌళి సై చిత్రంతో.. నితిన్ కెరీర్ పీక్స్ కి వెళ్లిపోయినా.. అక్కడ నుంచి ఇబ్బందులు పడ్డాడు ఈ కుర్రాడు.

8 ఏళ్ల పాటు ఒక్క హిట్ లేకుండానే 12 సినిమాలు చేశాడు నితిన్. మళ్లీ 2012లో ఇష్క్ నుంచి సక్సెస్ బాట పట్టిన నితిన్.. అక్కడి నుంచి కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. మంచి సినిమాలు వస్తే నిర్మాణం కూడా చేపట్టాడు. గతేడాది అఖిల్ తో నిర్మాతగా ఇబ్బందులు పడ్డా.. రీసెంట్ గా అ..ఆ.. మూవీతో హీరోగా కెరీర్ బెస్ట్ స్టేజ్ కి చేరుకున్నాడు. తొలిసారిగా 40కోట్ల హీరోగా అవతరించిన నితిన్ కి.. బెస్టాఫ్ లక్ చెబుతోంది తుపాకి.కాం.

,  ,  ,  ,  ,  ,  ,