Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2015 11:17:49
facebook Twitter Googleplus
Photo

ఓ ఏడాది క్రితం వరకూ ఏ ఛానల్ పెట్టినా బ్రహ్మీ కామెడీ సీన్స్ కనిపించేవి. సిల్వర్ స్క్రీన్ నే కాదు.. బుల్లితెరపైనా బ్రహ్మనందం ఆధిపత్యం కనిపించేది. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. రెండు స్క్రీన్ లపైనా కామెడీ కింగ్ స్పీడ్ తగ్గింది. కొత్త కమెడియన్లు కుమ్మేయడంతో పాటు.. డైరెక్టర్లు కూడా ఫ్రెష్ నెస్ కోస ట్రైచేయడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ విషయంపై ఓ మీడియా వ్యక్తి.. మీ స్పీడ్ తగ్గిందనుకుంటా అంటూ బ్రహ్మీని నేరుగానే క్వశ్చన్ చేశాడు. టీవీల్లో కూడా బ్రహ్మానందం లేని సినిమాలోని సీన్లను టెలికాస్ట్ చేయడాన్ని ప్రస్తావించాడు. ఈ మాటలు విన్న మన సీనియర్ కమెడియన్ సీరియస్ అయ్యాడు. మీడియా వాళ్లకు తనంటే వ్యతిరేకత పెంచుకున్నారంటూ ఆన్సర్ ఇచ్చాడు. మరి అదే ఛానల్ లో అంతకుముందు బ్రహ్మీ సీన్ లనే ఏళ్లకు ఏళ్లు వేశారు కదా.. అంటే మాత్రం ఈయన నుంచి ఆన్సర్ లేదు.

అయితే ఇండస్ట్రీలో తన పొజిషన్ స్ట్రాంగ్ అంటున్నాడు బ్రహ్మానందం. బ్రహ్మనందం లేకుండా హిట్ కొడతానని ఓ డైరెక్టర్ శపథం చేసి మూవీ తీస్తే అది ఫ్లాప్ అయిందని ఏడాది తర్వాత అదే డైరెక్టర్ తనకు ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి తీసిన మూవీ సూపర్ హిట్ అయిందని చెప్పాడు. కరెక్టే.. సినిమాని సింగిల్ హ్యాండ్ తో హిట్ తీరాలకు చేర్చే సత్తా ఉంది బ్రహ్మీకి. కానీ ఓ సినిమాలో తనే చెప్పినట్లున్నాడు కదా.. మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారని. ఆ విషయం ఎందుకు గమనించడం లేదో.?

,  ,  ,