Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jun-2015 17:14:45
facebook Twitter Googleplus
Photo

ఒక వైపున 'శ్రీమంతుడు' చిత్రవిశేషాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతూనే, మరో వైపున త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'బ్రహ్మోత్సవం' గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మహేష్ అభిమానులు ఆతృతను ప్రదర్శిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై నిర్మించబడుతోన్న ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనుంది. కుటుంబ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ జోడీగా సమంతా మరోమారు ఛాన్స్ కొట్టేసినట్టుగా ఇటీవల వార్తలు షికారు చేశాయి.

జూలై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. డిసెంబర్ 18న ఆడియో వేడుకను నిర్వహించి, జనవరి 8న సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అంటే సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలుస్తుందన్న మాట. తమిళ్లో అనువాదంగా కాకుండా స్ట్రయిట్ చిత్రంగా ఈ సినిమా అడుగుపెడుతుండటం విశేషం.

,  ,  ,