Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 11:28:57
facebook Twitter Googleplus
Photo

చాలానే చిన్న సినిమాలు రూపొందుతుంటాయి. టాలీవుడ్ లో అయితే వీటి కౌంట్ మరీ ఎక్కువగా ఉంటుంది. ఔత్సాహిక దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు కానీ.. వీటిలో చాలావరకూ రిలీజ్ కు నోచుకోలేకపోతుంటాయి. కొన్ని రిలీజ్ అయినా.. అవి వచ్చాయనే విషయం జనాలకు తెలిసేలోపే థియేటర్ల నుంచి ఎగిరిపోతుంటాయి.

ఇలాంటి సమయంలో ఓ చిన్న సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవాలన్నా.. విడుదలకు ముందు మంచి ప్రచారం లభించాలన్నా.. బడా వ్యక్తుల అండదండలు తప్పనిసరి అయిపోయాయి. ఇప్పటికే పలు చిన్న చిత్రాలకు తన బ్యానర్ అండ ఇచ్చిన దిల్ రాజు.. ఇప్పుడు మరో చిత్రానికి కూడా తన సపోర్ట్ ఇవ్వబోతున్నారు. ప్రేమతో మీ కార్తీక్ అనే చిత్రానికి తను మద్దతు ఇవ్వబోతున్నానని.. ఈ చిత్రం తమ బ్యానర్ పైనే డిస్ట్రిబ్యూట్ అవుతుందని దిల్ రాజు ప్రకటించారు. కాలేజ్ నేపథ్యంతో రొమాంటిక్ ఎంటర్టెయినర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని అంటున్నారు దిల్ రాజు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను రిలీజ్ చేసే కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు.. ఈ చిత్ర కథ నాకు తెలుసు. పాటలో కూడా మంచి భావుకత ఉండడం మాత్రమే కాదు.. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. మా బ్యానర్ పై ఈ మూవీని రిలీజ్ చేయనున్నాము. ఇది ఆ చిత్రానికి మంచి చేయడమే కాదు.. మా బ్యానర్ విలువ కూడా పెంచుతుందని భావిస్తున్నాను అన్నారు దిల్ రాజు

,  ,  ,  ,  ,