Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 13:19:57
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ?బ్రహ్మోత్సవం? సినిమా ఈనెల 20న విడుదలవుతుందని టీం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అడియో, పోస్టర్స్, ట్రైలర్‌తో తారాస్థాయిలో ఉన్న అంచనాల మధ్యన సినిమాను అనుకున్న తేదీకల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఆధ్వర్యంలో డబ్బింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా సాగుతున్నాయి.
ఇక పీవీపీ టీం మరోపక్క ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసింది. సోషల్ మీడియాలో రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ పీవీపీ టీం సినిమా కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. మంగళవారం కల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని సమాచారం. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు

,  ,  ,  ,  ,  ,  ,  ,