Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2017 11:50:37
facebook Twitter Googleplus
Photo

ఫ్లాపులకి అతీతంగా సాగుతోంది యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్. తెలుగులోనే కాదు తమిళంలో సైతం సందీప్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు సుశీంద్రన్ డైరెక్షన్ లో కెరాఫ్ సూర్య గా రాబోతున్నాడు సందీప్ కిషన్. గతంలో నా పేరు శివ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సుశీంద్రన్ ఇప్పుడు సందీప్ ను కెరాఫ్ సూర్యగా చూపించేందుకు ఓ వినూత్నమైన కథను అల్లుకున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం చక్రి చిగురుపాటి నిర్మించారు. హ్యాపెనింగ్ హీరోయిన్ మెహరిన్ ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన నటించింది. తమిళ సంగీత దర్శకుడు డి.ఇమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ కాన్సెప్ట్ టీజర్ కి సోషల్ మీడియాలో బాగానే రెస్పాన్స్ వస్తోంది. కమీడియన్ సత్యతో సందీప్ కిషన్ క్యారెక్టర్ ని పరిచయం చేయిస్తూ కట్ చేసిన ఈ టీజర్ ని చూస్తే సినిమాలో విషయం ఉందని అర్ధమవుతోంది. ఇక నటన విషయంలో సందీప్ కిషన్ కి మంచి మార్కులే ఉన్నాయి కనుక కెరాఫ్ సూర్యలో కూడా ఈ యంగ్ హీరో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయెచ్చు. దీనికి తోడు సుశింద్రన్ సినిమాల్లో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కెరాఫ్ సూర్యలో కూడా ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాలు సమాచారం.

,  ,  ,  ,