Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 13:01:20
facebook Twitter Googleplus
Photo

అసెంబ్లీ రౌడీ.. పేరుతోనే రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సినిమా. ఇప్పుడు మంచు మోహన్ బాబును విలక్షణ నటుడు అంటున్నారు కానీ.. అప్పుడాయన్ని అభిమానులు పిలుచుకునే పేరు కలెక్షన్ కింగ్. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. అప్పట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న స్టార్ హీరో కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టేసేవారాయన.

అనేక సెంటర్లలో 25వారాల పాటు ఆడిన అసెంబ్లీ రౌడీ విడుదలైన ఇప్పటికి పాతికేళ్లు పూర్తయింది. ఈ సినిమా గురించి.. అప్పటి కబుర్లను మోహన్ బాబు పంచుకున్నారు. 'అప్పటికే అల్లుడుగారుతో నేను మళ్లీ ఫాంలోకి వచ్చాను. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం చేయాలని అనుకున్నపుడు.. చాలామంది హెచ్చరించారు. అయినా సరే.. నాకు ఆయనపై నమ్మకం ఉంది. అలాగే హీరోయిన్ గా దివ్యభారతిని తీసుకుందామని అనుకుంటే.. తను సెట్స్ కి టైమ్ కి రాదని బోలెడన్ని డిమాండ్స్ చేస్తుందని అన్నారు. నేను వాటిని నమ్మకుండా అప్రోచ్ అయ్యాను. ఆమె వెంటనే ఒప్పుకుని సినిమా చేసింది. ఇక రిజల్ట్ అందరికీ తెలిసిందే' అన్నారు మోహన్ బాబు.

పేరుతోనే కాంట్రవర్సీ అయిన ఈ సినిమాను.. అప్పట్లో అందరు రాజకీయ నాయకులకు చూపించానని చెప్పారు మోహన్ బాబు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని.. వారంతా ఈ మూవీలో చూపించిన కాన్సెప్ట్ కరెక్ట్ అని ఒప్పుకున్నారని అన్నారు మోహన్ బాబు. అసెంబ్లీ రౌడీ స్టోరీ ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే.. ఇప్పుడు తీసినా కరెక్ట్ స్టోరీనే అనిపిస్తుంది. దటీజ్ కలెక్షన్ కింగ్స్ అసెంబ్లీ రౌడీ.

,  ,  ,  ,  ,  ,