Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 14:41:12
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. కొన్ని వివాదాల్లో నిజం ఉంటుంది. కొన్ని వివాదాల్ని కావాలనే రాజేస్తుంటారు. ఆయన సినిమాల కథల విషయంలో తరచుగా కాపీ ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఇంతకుముందు లింగా సినిమా కథ విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం తెలిసిందే. సరిగ్గా సినిమా విడుదలకు ముందు మొదలైన ఆ కాపీ కాంట్రవర్శీ రజినీతో పాటు ఆ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఐతే ఇప్పుడు రజినీ నటిస్తున్న కొత్త సినిమా కాలా కు షూటింగ్ ఆరంభ దశ నుంచే తలనొప్పులు మొదలయ్యాయి. ఈ సినిమా కథ తనదంటూ రాజశేఖరన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపిస్తున్నాడు.

రాజశేఖరన్.. కాలా నిర్మాత అయిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ సందర్భంలోనే తాను ‘కరికాలన్’ పేరుతో ఓ కథ రాశానని.. ఆ కథతో రజినీ కథానాయకుడిగా సినిమా చేయాలని అనుకున్నానని.. కరికాలన్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించానని.. ఇంతలోనే పా.రంజిత్ దర్శకత్వంలో కాలా సినిమా మొదలైపోయిందని.. తన కథను కాపీ కొట్టే ఈ సినిమా తీస్తున్నారని రాజశేఖరన్ ఆరోపించాడు. రాజశేఖరన్ కాలా టీంపై చెన్నై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం గమనార్హం. కాలా మాఫియా డాన్ హాజీ మస్తాన్ జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కుతున్న సినిమా అంటూ ఇంతకుముందు వార్తలు వినిపించాయి. దీనిపై హాజీ మస్తాన్ దత్తపుత్రుడు నోటీసులు కూడా ఇచ్చాడు. దానికి బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని చెప్పింది కాలా టీం.

,  ,  ,  ,  ,  ,