Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jan-2017 11:13:09
facebook Twitter Googleplus
Photo

కేథరిన్ థ్రెసాకు సౌత్ లోని అన్ని భాషల్లో డిమాండ్ ఉంది. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ కావడం.. కేరక్టర్ నచ్చితే రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా బెట్టు చేయదనే టాక్ ఉండడంతో ఈ భామకు అవకాశాలు చాలానే వచ్చాయి. అయితే.. తనకు వచ్చే ఆఫర్స్ ను అంచనా వేయడంలో.. ఒకటీ అరా మినహాయిస్తే అమ్మడి లెక్కలు తప్పుతూనే ఉన్నాయి.

మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 లో ఐటెం సాంగ్ కోసం మొదట కేథరిన్ థ్రెసానే సంప్రదించారు. అయితే.. ఈ మూవీకి కాస్ట్యూమ్స్ అందించిన చిరు డాటర్ సుశ్మితతో మాటామాటా వచ్చి బెట్టు చేయడంతో.. చివరకు ఈమెను ఐటెం భామ రోల్ నుంచి తప్పించారు. ఆ ఆఫర్ ను అందుకున్న రాయ్ లక్ష్మీ ఇప్పుడు ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఖైదీ మూవీ మిస్ చేసుకున్న కేథరిన్.. ఇప్పుడు ఫోటో షూట్స్ లో అందాలు ఆరబోస్తోంది.

తాజాగా మై సౌత్ దివా అనే కేలండర్ కోసం.. సోయగాలు చూపిస్తూ అమ్మడు హాట్ హాట్ పోజులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఖైదీ మూవీలో కాస్ట్యూమ్స్ విషయంలోనే గొడవ వచ్చిందనే రూమర్ ఉంది. మరి అంతకు మించి ఇక్కడ ఫోటో షూట్ లో ఎక్స్ పోజింగ్ చేసేయడం.. గ్లామర్ కురిపించడం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే.

,  ,  ,  ,  ,