Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jan-2016 13:58:33
facebook Twitter Googleplus
Photo

ఈ తరం కుర్ర భామలు అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గరన్న విషయం తెలిసిందే. గతంలో ఆన్ స్క్రీన్ కే పరిమితమైన అందాల పందేరం ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లోనూ జోరందుకుంది. ప్రోగ్రాంలు - ఈవెంట్లు - లాంఛింగ్ - అవార్డు ఫంక్షన్లు.. ఇలా సందర్భం ఏదైనా డ్రస్సింగ్ తో అ'ధర'గొట్టేస్తున్నారు. ముఖ్యంగా క్లీవేజ్ ప్రదర్శించడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోతోంది.

చమ్మక్ చల్లో సినిమాతో పరిచయం అయ్యి.. అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్ త్రెసా. గ్లామర్ డోస్ బాగానే ఉంటుంది కానీ క్లీవేజ్ షో జోలికి మాత్రం గతంలో వెళ్లేది కాదు. ఆఫర్లు ఉన్నా బాగానే ఉన్నా పెద్ద సినిమాల్లో ఛాన్సులొచ్చినా ఎద అందాల ప్రదర్శనలో మాత్రం పిసినారిగానే ఉండేది. ఇప్పుడు కేథరిన్ కూడా కంప్లీట్ క్లీవేజ్ ని ఎగ్జిబిట్ చేసేస్తోంది. అవార్డు ఫంక్షన్ తో పాటు తర్వాత ఎక్కడ కనిపించినా.. ఈ విషయంలో మాత్రం చాలానే జాగ్రత్తలు తీసుకుంటోంది. కాజల్ - రెజీనా - రకుల్ - రాశి ఖన్నాలు క్లీవేజ్ తో ఏ రేంజ్ విందు చేశారో.. ఆ రేంజ్ లో ఈమె కూడా ట్రయల్స్ వేసేస్తోంది.

ప్రస్తుతం కేథరిన్ బన్నీ సరసన సరైనోడు సినిమాలో సందడి చేయనుంది. ఎమ్మెల్యే పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది. ఈమెను సెక్యూర్ చేసే పాత్రలోనే బన్నీ కనిపించనున్నాడని టాక్. రోల్ ఏదనే విషయం ఇంకా రివీల్ చేయలేదు కానీ.. సరైనోడు మూవీ ద్వారా తనకు టాలీవుడ్ లో సరైన బ్రేక్ వస్తుందని.. ఈ భామ బోలెడు హోప్స్ పెట్టుకుంది.

,