Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2017 10:53:08
facebook Twitter Googleplus
Photo

కేథరిన్ థ్రెసా.. టాలీవుడ్ లో ఇంకా సరిగ్గా కెరీర్ ఫామ్ చేసుకోలేకపోయింది. తమిళ్.. మలయాళ భాషల్లో మెయిన్ హీరోయిన్ రోల్స్ చేస్తున్న కేథరిన్.. తెలుగులో మాత్రం ఇంకా రెండో హీరోయిన్ రోల్స్ కే పరిమితమైంది.

అప్పట్లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో మూవీలో అమలా పాల్ లీడ్ హీరోయిన్ అయితే.. కేథరిన్ సెకండ్ హీరోయిన్. గతేడాది రిలీజ్ అయిన సరైనోడులో రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్ చేయగా.. ఎమ్మెల్యేగా కొంత ప్రాధాన్యం ఉన్న పాత్రలో కేథరిన్ కనిపించింది. త్వరలో రిలీజ్ అవుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన హీరోయిన్ కాగా.. ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది కేథరిన్ థ్రెసా. ఈ మలయాళీ కుట్టి ఇలాంటి సెకండ్ హీరోయిన్ పాత్రలను ఇక వదిలిపెట్టడం.. లేదా తగ్గించుకోవడం ఉత్తమం అంటున్నారు నిర్మాత సీఎన్ రావు.

అటు లుక్స్ పరంగాను.. ఇటు పెర్ఫామెన్స్ లోనూ ఎంతో ట్యాలెంట్ ఉన్న కేథరిన్ థ్రెసా.. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలను తగ్గించుకుంటే మంచిది. సోలో హీరోయిన్ గా మెప్పించగలిగే ప్రతిభ ఆమెకు ఉంది.

,  ,  ,  ,  ,