Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 13:52:35
facebook Twitter Googleplus
Photo

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా ?తేరీ?ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో ?పోలీసోడు?గా విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ తెలుగులో పలు డబ్బింగ్ సినిమాలతో ఫర్వాలేదనిపించే హిట్స్ కొట్టినా, హీరోగా మాత్రం విజయ్ ఇప్పటికీ ఇక్కడ ఓ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ?పోలీసోడు? సినిమాను తెలుగులోనూ హీరో విజయ్‍కి ప్రత్యేక క్రేజ్ తెచ్చేలా దిల్‌రాజు టీమ్ భారీ రిలీజ్ ప్లాన్ చేసింది.
ఏప్రిల్ 14న తమిళంలో పెద్ద ఎత్తున విడుదల అవుతోన్న ఈ సినిమాను తెలుగులోనూ అదేరోజు విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ?పోలీసోడు? సినిమాను దిల్‌రాజు ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. దీంతో తమిళ వర్షన్ ?తేరీ? రిలీజైన ఒకరోజు తర్వాత తెలుగు వర్షన్ ?పోలీసోడు? రిలీజ్ కానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, అమీ జాక్సన్‍లు హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,