Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2016 17:19:23
facebook Twitter Googleplus
Photo

తెలుగులో వెలిగిపోదామని చాలా కాలం నుంచి ట్రై చేస్తోంది కేథరిన్ థ్రెసా. అనుకోకుండా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో మూడు సినిమాలు చేసే అవకాశం కొట్టేసింది కేథరిన్. తొలి సినిమా ?ఇద్దరమ్మాయిలతో? ఫ్లాపైనా.. రెండో సినిమా ?రుద్రమదేవి? అంతగా పేరు తెచ్చిపెట్టకపోయినా.. ?సరైనోడు?లో నటించే అవకాశం పట్టేసింది. తెలుగులో తొలిసారిగా.. హిట్టుకు హిట్టు.. పేరుకు పేరు సంపాదించింది. ఈ ఊపులో ఆమె ఇంకో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన 150వ సినిమాలో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసిందట కేథరిన్.

?కత్తి?కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేథరిన్ ఓ క్యామియో రోల్ చేస్తుందట. అంతే కాక.. చిరుతో కలిసి ఓ పాటలో డ్యాన్స్ కూడా చేయబోతోందట. మేనల్లుడితో మూడు సినిమాలు చేసిన హీరోయిన్ని క్యామియో రోల్ కైనా సరే.. చిరు ఓకే చేయడం విశేషమే. ఇక ఈ సినిమాలో అనుష్క లీడ్ హీరోయిన్ గా చేయడం అన్నది దాదాపు ఖాయమే. చిరుతో సినిమా అనగానే సంతోషంగా ఒప్పుకుందట అనుష్క.

ఆమె ఇంతకుముందు ?స్టాలిన్?లో చిరంజీవితో ఓ పాటలో డ్యాన్స్ చేసింది. గత నెలలో లాంఛనంగా మొదలైన చిరు-150 జూన్ తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. చిరు తనయుడు రామ్ చరణ్ ?కొణిదెల? ప్రొడక్షన్ బేనర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తాడు.

,  ,  ,  ,  ,  ,