Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 11:09:50
facebook Twitter Googleplus
Photo

ఊరక కలవరు సెలెబ్రిటీలు అనీ... ఓ మోడర్న్ సామెత! టాప్ సెలబిట్రీలు ఒకరిద్దరికి మించి ఒకేచోట కలుసుకుంటే ఆ కార్యక్రమంపై మీడియా ఫోకస్ ఉంటుంది. ఏదో ఒక కారణం లేకుండా అందరూ ఒకే చోటికి ఎందుకు చేరుకుంటారు అనే డౌట్ సహజంగానే వస్తుంది కదండీ..! అదేమన్నా ప్రముఖుల శుభ కార్యమా... ఒక సంస్థ ప్రారంభోత్సవమా... లేదా ఏదైనా యాడ్ ఫిల్మ్ షూటింగా అని అనుకుంటాం. బిగ్ బీ అమితా బచ్చన్ - జయాబచ్చన్ - మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ - భార్య అంజలి - ప్రముఖ నటుడు మమ్ముట్టి - ప్రభు - నాగార్జున - అక్కినేని అమల జయరాం ప్రముఖ గాయకుడు హరిహరన్ - సుజాతా మోహన్ - శ్వేతా మోహన్ - ప్రముఖ వయోలినిస్ట్ బాలభాస్కర్... ఇలా ప్రముఖ తారలందరూ ఒకే చోట తళుక్కుమన్నారు. వారు దిగిన గ్రూప్ ఫొటోని సోషల్ మీడియాలో అమితాబ్ పోస్ట్ చేశారు. తారలందరూ నవ్వులు చిందిస్తూ ఫోజు ఇచ్చారు. ఇంతమంది తారల్ని ఒకే ఫొటో చూడ్డం అభిమానులకు పండుగే!

అయితే వీరంతా ఒకేసారి ఎందుకు కలిశారంటే... ఒక ప్రముఖ నగర వ్యాపారి ఇచ్చిన పార్టీకి వచ్చారు! దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ నగల సంస్థ యజమాని గురువారం సాయంత్రం త్రిశూర్ లో ఈ భారీ పార్టీ ఇచ్చారు. నిజానికి ఈ తారాల్లో చాలామంది గతంలో ఆ కంపెనీకి చెందిన కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించారు. నాగార్జున - అమితాబ్ లు కలసి గత కొన్నేళ్లుగా ఒక యాడ్ ఫిల్మ్ లో కనిపిస్తూ ఉన్నారు. అమితాబ్ - సచిన్ లకు మాంచి స్నేహం ఉంది. ఇక - బిగ్ బీ - నాగ్ కు కూడా మంచి రిలేషన్ ఉంది. ఇంకేముంది... తారలందరూ ఒకరితో ఒకరి చక్కగా ముచ్చట్లు పెట్టేసుకుని టైం పాస్ చేశారు. ఈ పార్టీకి పలువురు సినీరంగ ప్రముఖులతోపాటు క్రీడా రాజకీయ రంగానికి చెందినవారు కూడా హాజరయ్యారు. మొత్తానికి వీరంతా ఒకే పార్టీలో ఇలా గ్రూప్ ఫొటో దిగడం విశేషమే..!

,  ,  ,  ,  ,