Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 11:35:59
facebook Twitter Googleplus
Photo

తన మాటలతో సెగలు పుట్టించగల సత్తా విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ సొంతం. తిట్టటమైనా.. పొగడటమైనా.. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయటంలోనైనా ఆయనకు ఆయనే సాటి. నచ్చినప్పుడు పొగిడేయటం.. నచ్చనప్పుడు తిట్టేయటం ఆయనకు అలావాటే. వారం కిందట తిరుపతిలో సభను ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ బహిరంగ సభను వర్మ తాజాగా యూట్యూబ్ లో చూశాడట. పవన్ స్పీచ్ విన్న వర్మ ట్విట్టర్ లో రియాక్ట్ కాకుండా ఉండలేకపోయినట్లున్నారు. పొగడ్తల మీద పొగడ్తల్ని పవన్ కల్యాణ్ మీద కుమ్మరించేశారు.

ఆ మధ్యలో పవన్ మీద విపరీతమైన వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల దృష్టిలో వర్మ పెద్ద విలనే అయ్యారు. ఇప్పుడేమో పవన్ స్పీచ్ వర్మను విపరీతంగా ప్రభావితం చేసినట్లుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ను కలిగి ఉండటం ఏపీ ప్రజల అదృష్టంగా ఆయన వ్యాఖ్యానించారు. పవన్ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో మరెవరూ లేరన్న ఆయన.. ?పవన్ కు తాను మాట్లాడుతున్న విషయంపై పూర్తి అవగాహన ఉంది. మూడు దశల్లో పోరాటం చేయాలన్న ఆయన నిర్ణయం సరైనది?? అని మెచ్చుకున్నారు.

పవన్ కల్యాణ్ తెలివైన ఆలోచనల్ని.. ఉద్యమ ప్రణాళికల్ని తెలివితక్కువ వాళ్లు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుందన్న వర్మ.. హోదా మీద పవన్ వ్యూహం తెలివైనదిగా పొగిడేశారు. పవన్ ను కలిగి ఉండటం ఏపీ ప్రజల అదృష్టంగా అన్న ఆయన.. తెలంగాణ గురించి వ్యాఖ్యానించలేదెందుకు? తిరుపతి బహిరంగ సభలో తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రత్యేక హైకోర్టు గురించి మాట్లాడటాన్ని వర్మ వినలేదా..?

,  ,  ,  ,  ,