Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 11:00:54
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగ చైతన్య మహానుభావుడు లాంటి హిట్ ను అందుకున్న దర్శకుడు మారుతి తో సినిమాను చేయడానికి ఒకే చెప్పేశాడు. చిన్న కాన్సెప్ట్ ను తీసుకొని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో మారుతి ఎంత ప్రతిభావంతుడో తెలిసిన విషయమే అయితే ఈ సారి మారుతీ తెరకెక్కించబోయే ఆ కొత్త కాన్సెప్ట్ లో చైతు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వనున్నాడట.

ఈ కాంబినేషన్ లో రూపొందే సినిమా గురించి ఇప్పుడు ఒక టాక్ బయటకు వచ్చింది. పెళ్లి తర్వాత ప్రతిఒక్కరిలో కొన్ని ఈగోలు మొదలవుతూ ఉంటాయి. కొంతమంది సర్దుకుపోతే.. కొంతమంది వాటిని పీక్స్ లో చూపిస్తారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో మారుతిన కథను అల్లుతున్నడని.. చైతూ పెళ్లి తర్వాత ఈ సినిమాపై పూర్తి వివరాలను తెలియజేస్తారని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం చైతు గోవాలో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి కొడుకు అవనున్నాడు. సమంత కూడా ఇప్పటినుండే రెడీ అవుతోంది.

ఇక ఆ పెళ్లి తర్వాత చైతు - చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యాసాచి సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేస్తాడు.

,  ,  ,  ,  ,