Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 11:13:10
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు పూరీ జగన్నాథ్ - డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. లోఫర్ సినిమా నష్టాలకు సంబంధించిన గొడవ.. చివరకు పోలీస్ కేసుల వరకూ కూడా వెళ్లింది. ఈ వివాదంలో కొందరిపై పోలీస్ కేసులు కూడా పెట్టాడు పూరీ. అలాగే లోఫర్ సినిమా నైజాం రైట్స్ ను కేవలం 3 కోట్లకే కొని ఎక్కువ రేటు అని అబద్ధాలు చెబుతున్నారంటూ రివర్స్ అయ్యాడు పూరీ.

అయితే.. ఈ డిస్ట్రిబ్యూటర్లు తాము 7.05 కోట్లకు లోఫర్ హక్కులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపించారు. అంతే కాదు.. ఫైనాన్షియల్ రిపోర్టులు కూడా వీరికే అనుకూలంగా ఉన్నాయి. దీంతో పూరీ పెట్టిన కేస్ నిలబడదని చాలామంది అంటున్నారు. ఇక ఈ దర్శకుడికి సన్నిహితంగా ఉండేవారు అయితే.. కేసును వాపసు తీసుకోవాలని సూచిస్తున్నారు కూడా. ఈ కేసు కారణంగా ఇండస్ట్రీలో సెట్ అయిన ఓ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

పూరీకి సన్నిహితంగా ఉండే కొంతమంది స్టార్ హీరోలు కూడా.. పూరీకే హితవు పలుకుతున్నారట. ఈ కేసు కారణంగా ఉన్న రెప్యుటేషన్ కోల్పోతావని చెబుతున్నారట. ఈ కేసు ఇంకా కంటిన్యూ చేస్తే.. పూరీపై లీగల్ చర్యలు తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతుండడంతో.. ఇక ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకాలని చెబుతున్నారట. దీంతో పూరీనే వెనక్కి తప్పగ తప్పదని సారీ కూడా చెప్పాల్సి వస్తుందని అంటున్నారు.

,  ,  ,  ,  ,