Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 10:42:07
facebook Twitter Googleplus
Photo

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చాలానే సినిమాలు చేశారు. చాలామంది హీరోయిన్స్ తోనే చిందులు వేశారు. వారిలో కొందరు హీరోయిన్లు తిరిగి ఏఎన్నార్ కుమారుడు నాగార్జున పక్కన కూడా జోడీగా నటించారు. వీరిలో శ్రీదేవి.. రాధల పేర్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఓ హీరోయిన్ తండ్రి పక్కన నటించి.. తర్వాత కొడుకుతో చేయడం అనే ట్రెండ్ ని అక్కినేని వంశంతోనే మొదలయిందని చెప్పచ్చు.

ఇప్పుడు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ల విషయంలో ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రితో కలిసి నటించిన ఓ హీరోయిన్ ని తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు చైతు. ఈ అక్కినేని కుర్రాడు హీరోగా సురేష్ బాబు-సాయి కొర్రపాటి కలిసి నిర్మించనున్న ఓ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది. ఇందులో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే.. లావణ్య ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జునకు భార్యగా నటించిన విషయం తెలిసిందే. నాగ్-లావణ్యల జంట కూడా చూడముచ్చటగా ఉందనే పేరు వచ్చింది.

నాన్నకు భార్యగా నటించిన భామను.. తనకు హీరోయిన్ గా తీసుకున్నాడు చైతు. ఇక ఈ మూవీకి మరో స్పెషాలిటీ కూడా ఉంది. మేనమామ సురేష్ బాబు నిర్మాణంలో నాగచైతన్య చేస్తున్న తొలి మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా కృష్ణ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. అయితే.. రామ్ చరణ్ కి హీరోయిన్ గా చేసిన కాజల్.. ఖైదీ నంబర్ 150లో తండ్రి చిరంజీవికి హీరోయిన్ గా చేసి మెప్పించిన సంగతి టాలీవుడ్ ఆడియన్స్ కి తెలుసుగా!

,  ,  ,  ,