Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2017 15:50:59
facebook Twitter Googleplus
Photo

నాగ చైతన్య ప్రేమమ్ సినిమాతో లవర్ బోయ్ గా మరో మెట్టు పైకి వెళ్ళాడు అనే చెప్పాలి. ఏం మాయ చేసావే సినిమాతో మరో ప్రేమ కథల వారసుడు వచ్చాడు అని అందరికీ అర్ధమైంది. అలాంటి ఇమేజ్ కోసం నాగ చైతన్య కూడా చాలా పాట్లు పడ్డాడు. నిన్న ప్రేమమ్ తో కాస్త సర్ధుకున్నాడు. నిజ జీవితంలో కాబోయే భార్య సమంతతో స్క్రీన్ పై ఉండే సొ కాల్డ్ కెమిస్త్రీ గురించి తెలిసిందే. ఇప్పటివరుకు చైతు చేసిన అందరి హిరోయిన్స్ లో మంచి జంటగా గుర్తింపు క్రేజ్ ఉన్న జోడీ అంటే అది సమంతా నాగ చైతన్యదే.

కాకపోతే ఇప్పుడు ఆ స్క్రీన్ జోడికి పోటీగా మరో కొత్త పేరు వినపడుతోంది. ఆమె చైతు కొత్త సినిమా రారండోయ్ వేడుక చూద్దాంలో జంటగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా టిజెర్ విడుదల అయినప్పటి నుండి సినిమా పై అంచనాలు నెమ్మదినెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరుకు రకుల్ చేసిన సినిమాలు కన్నా ఈ సినిమాలో కనిపించే తీరు కాస్త బిన్నంగా ఉండటమే దానికి కారణం అనుకోవచ్చు. వీళ్ళ ఇద్దరి మధ్య కెమిస్త్రీ చూస్తే మొన్నటి క్లాసిక్ ప్రేమకథ నిన్నే పెళ్లాడతా లా మిగిలిపోతుందో ఏమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. రారండోయ్ వేడుక చూద్దాంలో రకుల్ చిలిపి నవ్వు ఓర చూపులూ అందరినీ ఆకట్టుకుంటున్నాయ్.

నాగార్జున కు స్క్రీన్ పై మంచి రొమాంటిక్ జోడీ అంటే తబు అనే చెప్పాలి. ఇప్పుడు రాకుల్ నాగ చైతన్య కి తబులా మరాబోతుంది ఏమో చూడాలి. ఈ సినిమాని ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. మరి ఈ జంట స్క్రీన్ ప్రేమ ఎంత మందికి నచ్చుతుందో చూద్దాం.

,  ,  ,  ,