Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 14:17:54
facebook Twitter Googleplus
Photo

దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు చందూ మొండేటి. ఐతే ఇలాంటి కొత్త తరహా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చందూ.. రెండో సినిమా ఒక రీమేక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే నాగచైతన్య ఆబ్లిగేషన్ వల్ల చందూ ఆ సినిమా చేయక తప్పలేదు. అలాగని దాన్నేమీ తేలిగ్గా తీసుకోలేదీ యువ దర్శకుడు. రీమేక్ కూడా మనసు పెట్టి చేశాడు. మంచి ఫలితాన్నందుకున్నాడు. ఇప్పుడిక తన స్టయిల్లో మూడో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. నాగచైతన్యే కథానాయకుడిగా చందూ దర్శకత్వంలో సవ్యసాచి బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.

రెగ్యులర్ షూటింగ్ కూడా వెంటనే మొదలుపెట్టేసి చకచకా సినిమా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేసింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. చైతూ తన సొంత బేనర్ కాకుండా బయట సినిమా చేస్తున్న అతి పెద్ద బేనర్ ఇదే. అలాగే చందూకు కూడా ఇది పెద్ద సినిమానే. దీని బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందట. ఇదొక ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోకు ఎడమ చేయి తన అదుపులో ఉండదు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు. వచ్చే ఏడాది వేసవి చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు

,  ,  ,  ,  ,