Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 14:34:21
facebook Twitter Googleplus
Photo

ఈ తరం టాలీవుడ్ యువ దర్శకుల్లో మోస్ట్ ఎగ్జైటింగ్గా అనిపిస్తున్న వాళ్లలో చందూ మొండేటి ఒకడు. ?కార్తికేయ? లాంటి మంచి థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన చందూ.. ఆ తర్వాత ?ప్రేమమ్? లాంటి రీమేక్ మూవీతోనూ తన ప్రత్యేకత చాటుకోవడంతో అతను టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత కూడా అతడి కోసం లైన్లో ఉన్నాడు. సీనియర్ హీరోలు నాగార్జున.. వెంకటేష్ లతో పాటు రవితేజ కూడా చందూతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. ఓ దశలో ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. ఐతే ఐ డ్రీమ్స్ వాసుదేవరెడ్డికి మూడో సినిమా చేస్తానని మాటిచ్చిన చందూ.. ఆ ప్రాజెక్టు కోసం వరుణ్ తేజ్ ను కథానాయకుడిగా అనుకున్నాడు.

ఐతే మోకాలి గాయంతో వరుణ్ దాదాపు రెండు నెలలు షూటింగ్ కు దూరమైపోవడంతో ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న మిస్టర్.. ఫిదా సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. చందూ సినిమాకు ఇప్పుడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో వేరే హీరోతో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది చందూకు. మరి అతడి హీరో ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ మధ్య రవితేజ పేరు గట్టిగా వినిపించింది. ఎన్టీఆర్ కూడా చందూ సినిమాపై ఆసక్తితోనే ఉన్నట్లు చెప్పారు. ఐతే ఫైనల్ గా చందూ.. నాగార్జునతోనే సినిమా చేసేలా ఉన్నట్లు సమాచారం. ఇంతకుముందు నాగ్ కోసం ఒక పోలీస్ స్టోరీ చెప్పాడు చైతూ. ఆ కథతోనే సినిమా చేయడానికి నాగార్జున బాగా ఆసక్తితో ఉన్నాడట. పైగా నాగ్ చందూ అభిమాన హీరో. దీంతో ఆయనతోనే సినిమా ఓకే చేసే అవకాశాలున్నాయట. ఈ ప్రాజెక్టుపై ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుందని సమాచారం.

,  ,  ,  ,  ,