Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2017 13:48:49
facebook Twitter Googleplus
Photo

సురేందర్ రెడ్డిని స్టైలిష్ దర్శకుడు అంటారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటివరకూ అదే మాట వినిపించింది కానీ.. ఇప్పుడు మాత్రం మెగా డైరెక్టర్ అనేస్తున్నారు. రామ్ చరణ్ తో ధృవ మూవీ చేసి.. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో అవకాశం అందుకోవడమే ఇందుకు కారణం. ధృవ రిలీజ్ సమయంలో చిరంజీవితో మూవీ సంగతి చెప్పినా.. ప్రమోషన్స్ అనుకున్నారంతా. కానీ అదే నిజమయ్యే సరికి షాక్ తినేశారు.

ఖైదీ నంబర్ 150 మాదిరిగానే.. మెగా 151కు కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సూరితో ఓ సినిమా చేసి ఏడాది జర్నీ చేస్తున్న చరణ్.. ఇప్పుడు తను నిర్మాతగా తీసే చిత్రానికి సురేందర్ రెడ్డినే దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ స్టోరీ డిస్కషన్స్ కోసం.. తరచుగా వీరిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు. వీకెండ్స్ లో తన పిల్లలను కూడా రామ్ చరణ్ ఇంటికి తీసుకొచ్చేంతటి సాన్నిహిత్యం వీరికి పెరిగిపోయింది. ఈ సందర్భంగా.. సూరి పిల్లలు ఇద్దరికీ తన స్టైల్ లో స్పెషల్ గిఫ్ట్ లు పంచాడు చెర్రీ. బుల్లి గుర్రంపై ఎక్కించి చక్కర్లు కొట్టించాడు. తను కూడా ఎత్తుకుని తెగ ఆడించేశాడు.

మరోవైపు ఉయ్యాలవాడ స్టోరీకి తన స్టైల్ మెరుగులు దిద్దుతున్నాడు సురేందర్ రెడ్డి.

,  ,  ,  ,  ,  ,