Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jul-2016 11:58:40
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యకు సినిమాలపై ఉన్న ఇష్టాన్ని పక్కనబెడితే, ఆయన సరికొత్త బైక్స్‌ని కూడా అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. మార్కెట్లో వచ్చే కొత్త బైక్స్‌పై ఎప్పటికప్పుడూ చైతూ ఓ కన్నేసి ఉంచుతారు. తాజాగా ఆయన ట్రియూంప్ కంపెనీ నుంచి ఈమధ్యే వచ్చిన ?థ్రక్స్‌టన్ ఆర్? అనే మోడల్ బైక్‌ను కొనుగోలు చేశారు. హైద్రాబాద్‌లోని ట్రియూంప్ షోరూమ్‌లో రెండు రోజుల క్రితం చైతన్య ఈ బైక్‌ను కొన్నారు. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ షోరూమ్ నిర్వాహకులు థ్రక్స్‌టన్ ఆర్ స్పెషల్ కస్టమర్‌గా చైతన్య తమ వద్దకు రావడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
సుమారు 11 లక్షల రూపాయల ఖరీదైన (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర) ఈ బైక్‌ ప్రస్తుతం యువత కోరే అన్ని సదుపాయాలను నింపుకుందని తెలుస్తోంది. ఇక బైక్ కొన్న వెంటనే చైతూ దానిపై ఓ రైడ్‌కు వెళ్ళారు. ఇదిలా ఉంటే చైతూ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ అనే రెండు సినిమాలూ త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,