Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Mar-2017 11:30:59
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ ని సుకుమార్ ఓ పల్లెటూరి మొనగాడిగా తెరపై ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. చెర్రీ 11వ సినిమాని పక్కా ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించబోతున్నారు సుకుమార్. ఆ సినిమాకోసం చెర్రీ లుక్ కూడా ఛేంజ్ అయిపోయింది. గుబురు గెడ్డంతో ఆయన దర్శనమిస్తున్నాడు. చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉంది. విదేశాల్లో తొలి షెడ్యూల్ ని తెరకెక్కిస్తారని ప్రచారం సాగింది. అయితే సుకుమార్ మాత్రం తన ప్లానింగ్ లో కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.

తొలి షెడ్యూల్ ని గోదావరి జిల్లాల్లోనే 35 రోజులపాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేయాలనుకొన్నాడట. ఆ ఒక్క షెడ్యూల్ తోనే టాకీపార్ట్ చాలా వరకు పూర్తయిపోతుందట. అందుకోసం గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆర్ట్ వర్క్ - ప్రొడక్షన్ వర్క్ పెద్దయెత్తున సాగుతోందట. ఏప్రిల్ 1 నుంచి చెర్రీ సెట్లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమా విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. తన కెరీర్ లో ఓ కొత్త బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం అది కూడా సుకుమార్ లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ తెరకెక్కిస్తుండటంతో చెర్రీ సినిమా గురించి ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాడని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకోసం పెంచిన గెడ్డం - తీర్చిదిద్దిన కొత్త లుక్ తోనే చెర్రీ పలు వేదికలపై కనిపించారు.

,  ,  ,  ,  ,  ,