Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 15:38:57
facebook Twitter Googleplus
Photo

మెగా బ్రదర్ నాగేంద్రబాబు కొణిదెల నీహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్న మూవీ 'ఒక మనసు.' ఇప్పటికే క్రేజ్ ఉన్న కుర్ర హీరో నాగశౌర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నా.. అతడి కంటే ఎక్కువగా నీహారిక గురించే మాట్లాడుకుంటున్నారు. 'ఒక మనసు' విషయంలో ఫోకస్ అంతా నీహారికపైనే ఉండడంతో.. ఈ హీరో ఫీల్ అవుతున్నాడనే టాక్ వినిపించింది.

త్వరలో రొమాంటిక్ మూవీ తెరకెక్కిన 'ఒక మనసు'ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్ లాంఛ్ పూర్తి కాగా.. త్వరలో ఆడియో లాంఛ్ చూడా జరగనుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు ప్రధాన సభ్యులు. ఇందులో భాగంగా నీహారిక డామినేషన్ అనే టాపిక్ పైనా స్పందించాడు హీరో నాగ శౌర్య. 'నీహారిక నటన ఎంతో నేచురల్ గా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఒక మనసు రిలీజ్ అయ్యాక.. ఆమె తప్పనిసరిగా స్టార్ హీరోయిన్ అయిపోతుంది. ప్రతీ ఒక్కరూ ఆమెను - ఆమె నటనను ప్రేమిస్తారు. 'అంటూ నీహారికను ఆకాశానికి ఎత్తేశాడు నాగశౌర్య.

నాగశౌర్య చెప్పిన మాటలతో.. నీహారికకు వస్తున్న పబ్లిసిటీపై ఈ హీరో ఎలాంటి జెలసీ ఫీల్ అవడం లేదని అర్ధమవుతుంది. ఇప్పటివరకూ యాంకర్ గా ప్రశంసలు అందుకున్నా. ఇప్పుడు తొలిసారిగా హీరోయిన్ పాత్రకు.. తన తోటి హీరోతో ప్రశంసలు అందుకుంది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్వరలో ఆడియో ఫంక్షన్ చేయనుండగా.. దీనికి మెగా ఫ్యామిలీ హీరోలు చాలామంది హాజరు కానుండడం విశేషం.

,  ,  ,  ,  ,