Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2017 11:06:39
facebook Twitter Googleplus
Photo

ఛార్మి సిట్ ఎక్సయిజ్ విచారణ సాగుతునన్ తీరు మీద హైకోర్టుకు వెళ్లడం ప్రస్తుతానికి అత్యంత హాట్ టాపిక్. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయమై పెద్ద కలకలం రేగుతోంది. సిట్ తీరు విషయంలోనూ ప్రకంపనాల్ని సృష్టిస్తోంది. ఇదంతా సర్వసాధారణంగా జరుగుతున్నదే కాగా ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి... ఛార్మి తనకు సన్నిహితుల్లో ఎవ్వరి సలహా సూచనల్ని పట్టించుకోకుండా తనంత తాను హైకోర్టుకు వెళ్లే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తనంతగా తాను వ్యవహారాన్ని మరింత జటిలం చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది ప్రముఖులకే ఎక్సయిజ్ విచారణ నోటీసులు అందాయి. వీరిలో సెలబ్రిటీ హోదా ప్రకారం లెక్కవేసుకున్నా పూరీ జగన్నాథ్ అగ్రభాగంలోనే ఉంటారు. ఇంకా ఎంతో మంది నటులు - టెక్నీషియన్లు ఉన్నారు. పైగా ఎక్సయిజ్ పోలీసులు విచారణకు పిలిచారే తప్ప.. ఎక్కడా వారు నేరానికి పాల్పడినట్లుగా ఆరోపించలేదు. ఇప్పటిదాకా అయిదుగురి విచారణ పూర్తి కాగా వారంతా పోలీసులకు ఎంతో సహకరించారు. పోలీసు విచారణ గురించి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యానాలు చేయలేదు. నిజానికి వారందరి నుంచి గోళ్లు - వెంట్రుకలు - బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారి యిష్టంతోనే ఈ శాంపిల్స్ సేకరించినట్లుగా విచారణాధికారులు ప్రకటించారు. వారెవ్వరూ అభ్యంతరాలూ వ్యక్తం చేసినట్టు రాలేదు.

అయితే హఠాత్తుగా ఛార్మి అయిదోరోజున సిట్ విచారణ జరుగుతున్న తీరు సవ్యంగా లేదంటూ తప్పుపట్టారు. ఏ ఆధారాలతో ఎవ్వరి నుంచి అందిన సమాచారం మేరకు ఆమె విచారణను అనుమానిస్తున్నారనే సంగతి పిటిషన్ లో పేర్కొనకపోయినా.. కోర్టులో న్యాయమూర్తి ఎదుట చెప్పాల్సి రావొచ్చు. ఈ పిటిషన్ ద్వారా ఆమె శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోవచ్చేమో గానీ.. విచారణనుంచి మినహాయింపు పొందలేరని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారిస్తాం అంటూ విచారణాధికారులు ముందుగానే చెప్పారు. అయితే 26న సిట్ కార్యాలయానికి రావడానికి నోటీసులు ఇచ్చిన సమయంలో అంగీకరించిన ఛార్మి - ఒక్కరోజు ముందు హైకోర్టులో కేసు వేయడం విశేషం. అయితే ఈ కేసుతో నోటీసులు అందుకున్న ఇతర సినీ సెలబ్రిటీల్లో ఛార్మికి పరిచయస్తులైన కొందరు వద్దని వారించినా కూడా వినకుండా ఛార్మి న్యాయస్థానం గడప తొక్కినట్లు తెలుస్తోంది. విచారణకు భయపడాల్సిన అవసరం లేదని శాంపిల్స్ కు కూడా జడవాల్సిన పని లేదని.. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినా కూడా అది పెద్ద కేసు కాదని.. ఛార్మికి ముందే చెప్పినప్పటికీ.. ఆమె ఆవేశంలో విచారణ తీరు మీద హైకోర్టును ఆశ్రయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ తీరును నిలదీయడం వలన కేసు సంక్లిష్టంగా మారుతుందా? అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే విచారణాధికారులు మాత్రం.. ఆమె కోర్టుకు వెళ్లడాన్ని పెద్ద సీరియస్ గా పట్టించుకోకపోవచ్చుననే వాదన వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,