Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 13:54:29
facebook Twitter Googleplus
Photo

కార్తి.. అదితి రావు హైదరి జంటగా నటించిన చెలియా చిత్రం పై.. కొన్ని రోజుల క్రితం వరకు అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మణిరత్నం మూవీ కావడంతో.. మరో క్లాసిక్ మూవీ అందిచబోతున్నాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ రిజల్ట్ మాత్రం చాలా చాలా తేడా కొట్టేసింది. చెలియా మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచిపోతోంది.

తెలుగు మార్కెట్లో తొలి రోజు పర్లేదనిపించిన కలెక్షన్స్.. ఆ తర్వాత మరీ దారుణంగా పడిపోయాయి. ఇక ఈ సినిమా కోలుకునే ఛాన్స్ లేదని ట్రేడ్ జనాలు తేల్చేస్తున్నారు. ఓవర్సీస్ లో క్లాస్ మూవీస్ కి విపరీతమైన ఆదరణ ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ చెలియా విషయంలో ఆ లెక్కలు కూడా తప్పాయి. తొలి వారాంతం ముగిసే సరికి కనీసం లక్ష డాలర్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. తమిళ్ వెర్షన్ కాట్రు వెలియిదాయ్ 3.72 లక్షల డాలర్లతో పర్లేదనిపించింది. కానీ చెలియా మాత్రం.. గురువారం ప్రీమియర్స్ నుంచి ఆదివారం వసూళ్ల వరకు కలిపి కేవంల 82 వేల డాలర్ల మార్క్ ను మాత్రమే అందుకోగలిగింది.

అసలు చెలియాపై ఆడియన్స్ నామమాత్రపు ఆసక్తి కూడా చూపలేదనే విషయం తేలిపోతోంది.

,  ,  ,  ,  ,