Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 12:18:12
facebook Twitter Googleplus
Photo

ఓకే బంగారం సినిమాతో తన మ్యాజిక్ ఏంటో మరోసారి నిరూపించుకొని, సూపర్ హిట్ కొట్టిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం తాజాగా మళ్ళీ ఓ రొమాన్స్ డ్రామాతోనే మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కాట్రు వెళదియై పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తీ, అదితి రావు హైదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను చెలియా పేరుతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డబ్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పట్నుంచే సందడి మొదలుపెట్టేసింది.
ఫిబ్రవరి 2న చెలియా ఆడియోలోని హంసరో అన్న మొదటిపాట విడుదల కాగా, ఆ పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇదే కోవలో ఇప్పుడు ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) కానుకగా మైమరపురా అన్న మరో పాటను విడుదల చేస్తున్నారు. మణిరత్నం-రహమాన్‌ల కాంబినేషన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటల రిలీజ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ ఓ యుద్ధ విమాన పైలైట్‌గా కనిపించనున్నారు

,  ,  ,  ,  ,