Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:05:03
facebook Twitter Googleplus
Photo

సినిమాలకి ప్రమోషన్ చాలా ఆయుధంగా మారింది. మంచి కథలను ప్రేక్షకులు చూసేలా చేయాలన్నా సినిమా వాళ్లు షూటింగ్ లో కష్టపడిన దానికంటే ప్రమోషన్స్ లోనే ఎక్కువగా కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ టీజర్స్ తో కూడా సినిమాలకి బాగా క్రేజ్ తెస్తున్నారు. అందుకోసం స్పెషల్ గా సీన్స్ చేసి సోషల్ మీడియాలో వదిలి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే అదే తరహాలో సౌత్ బ్యూటీ అమలాపాల్ కూడా రీసెంట్ గా ఓ సెన్సేషన్ వీడియో రిలీజ్ చేసింది. అమ్మడు మొన్న గుప్పు గుప్పు మంటూ ఓ పిట్టా గోడ మీద కూర్చొని సిగరెట్ తాగింది గుర్తుంది కదా! ఆ సీన్ అమ్మడు తీయబోయే నెక్స్ట్ సినిమాలోదేనట. ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలామంది అసలు నిజంగా ఆమె అమలాపాల్ కాదు అని అన్నారు. అలాగే మరికొందరు ఆమె నిజంగా సిగరేట్ తాగలేదు..

అది గ్రాఫిక్స్ అని చెప్పారు. కానీ ఫైనల్ గా అమల చెప్పేవరకు ఈ విషయంపై క్లారిటీ రాలేదు. ఆ సిగరెట్ తాగింది తనేనంటూ అది తన నెక్స్ట్ సినిమాలో ఉండబోతున్నట్లు అమలాపాల్ క్లియర్ గా చెప్పేసింది. ఆ సినిమాలో పాత్ర స్వభావం అలా ఉంటుందని ఆ వీడియోని రిలీజ్ చేసి ముందే ఓ క్లారిటి ఇచ్చినట్లు చెప్పింది.

,  ,  ,  ,  ,