Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 13:04:21
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది అవార్డు ఫంక్షన్స్ కు సంబంధించి.. నామినేషన్స్ లోనే వివాదాలు మొదలయ్యాయి. గతేడాది బాహుబలి - శ్రీమంతుడు అంటూ టాలీవుడ్ లో ఆల్ టైం హిట్స్ 2 సినిమాలు రావడంతో.. అవార్డుల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు సినీ'మా' అవార్డుల్లో ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ కు అవార్డ్ దక్కింది.

సైమా - ఫిలింఫేర్ - మా అవార్డులకు గాను.. నామినేషన్స్ పరిశీలిస్తే.. ప్రభాస్ (బాహుబలి) - మహేష్ (శ్రీమంతుడు) - నాని(భలే భలే మగాడివోయ్) - వరుణ్ తేజ్(కంచె) - ఎన్టీఆర్(టెంపర్) - అల్లు అర్జున్(రుద్రమదేవి) ఉన్నాయి. సైమా అసలు ఎన్టీఆర్ ని నామినేట్ చేయలేదు. సినీ'మా' అవార్డుల్లో మాత్రం ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. బాహుబలి మంచి పెద్ద కాన్వాస్ ఉన్న చిత్రం. ఇక శ్రీమంతుడు అయితే.. యాక్షన్ కంటే కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. భలే భలే మగాడివోయ్ లో నాని.. ఎప్పుడూ చేసే కామెడీనే చేసి చూపించాడు. వరుణ్ తేజ్ కంచె కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్. రుద్రమదేవిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నా.. ఇది పూర్తి స్థాయి పాత్ర కాదు.

అందరితో పోల్చితే.. టెంపర్ లో ఎన్టీఆర్ పోషించిన పాత్ర - ఆ రోల్ లో తను చూపించిన ప్రతిభ సామాన్యమైనవి కాదు. ఇప్పుడు అందుకున్న అవార్డ్ నే కాదు.. ఫిలిం ఫేర్ ను కూడా ఎన్టీఆర్ గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక సినీ'మా' అవార్డును అందుకున్నాక.. 'మాకు ఎన్నేళ్లు వచ్చినా.. ఎన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నా మా అందరికీ స్ఫూర్తి చిరంజీవి గారు - బాలకృష్ణ గారు - నాగార్జున గారు' అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ విషయానికొస్తే.. రుద్రమదేవిలో అనుష్కకు ఇవ్వడంలో ఎలాంటి వివాదాలు - సందేహాలు ఉండవు. ఈ మధ్య కాలంలో పెర్ఫామెన్స్ విషయంలో అనుష్కకు పోటీ ఇచ్చేవారు దగ్గరలో కనిపించడం లేదు కదా.

,  ,  ,  ,  ,  ,