Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Mar-2016 12:23:56
facebook Twitter Googleplus
Photo

బాగా బ్యాడ్ టైంలో ఉన్నపుడు ఓ మంచి హిట్ రూపంలో ఊరటనిచ్చింది ఇష్క్ మూవీ. ఆ వెంటే వచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే సూపర్ హిట్ సాధించి నితిన్ ని ఫాం లో నిలబెట్టింది. ఈ చిత్ర దర్శకుడు కొండా విజయ్ కుమార్ తో ఓ సినిమా తీసేందుకు నితిన్ రెడీ అయ్యాడనే విషయం ఇంతకు ముందే తెలుసు. అయితే.. ఇప్పుడా చిత్రం సీక్వెల్ అనడమే అసలు విషయం.

గుండెజారి గల్లంతయ్యిందే మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కనుంది. మొదటి భాగంలో కనిపించిన హీరోయిన్ నిత్యామీనన్ - సెకండ్ పార్ట్ లో కూడా ఉంటుందని తెలుస్తోంది. నితిన్ ఈ చిత్రాన్ని తన సొంత బేనర్ పైనే తీసేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు కొండా విజయ్ కుమార్ చెప్పిన స్టోరీ లైన్ సూపర్బ్ గా నచ్చడంతో.. తనే ఈ చిత్రాన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యాడట నితిన్.

ప్రస్తుతం ఓ కన్నడ నిర్మాత కూడా గుండెజారి గల్లంతయ్యిందే 2 నిర్మాణానికి ముందుకొచ్చాడు. అయితే నితిన్ మాత్రం తనే నిర్మించాలనే పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది. అఖిల్ డిజాస్టర్ తర్వాత తన బ్యానర్ కి మంచి హిట్ తోపాటు వసూళ్లను కూడా తెచ్చి పెట్టాల్సిన బాధ్యత నితిన్ పై పడింది. అందుకే మంచి స్టోరీని వదులుకోకూకడదనే ఈ అటెంప్ట్ అంటున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,  ,  ,