Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2016 11:04:18
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఏ సినిమాకైనా కంటెంట్ తో సమానంగా హైప్ చాలా ముఖ్యం. హైప్ ఎక్కువై కంటెంట్ తేడా పడితే.. రిజల్ట్ మరీ తేడా వచ్చేస్తుంది. అందుకే హైప్ విషయంలో చాలా బ్యాలెన్సెడ్ గా ఉండాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్.. ఇలా హీరో ఎవరైనా ఆ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఏదో ఒక సంథింగ్ ఉండాల్సిందే.

మరి మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చేస్తున్నారు. 150వ సినిమా కత్తిలాంటోడును మొదలుపెట్టేస్తున్నారు. చిరంజీవి సినిమా అంటే ఆయనే పెద్ద బ్రాండ్. మరి మెగా బ్రాండ్ అంటే అందులో డ్యాన్సులు కంపల్సరీగా ఉంటాయి. గతేడాది షష్టిపూర్తి చేసుకున్న హీరో.. ఈ ఏడాది చేయబోయే సినిమా డ్యాన్సులు ఏ మాత్రం వేస్తాడనే డౌట్ చాలామందిలోనే ఉంది. ఇలాంటి వాటన్నిటికీ స్ట్రయిట్ గా తన పెర్ఫామెన్స్ తోనే ఆన్సర్ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి.

సినీ'మా' అవార్డ్స్ లో గ్యాంగ్ లీడర్ - ముఠామేస్త్రీలతో పాటు తన సాంగ్స్ మెడ్లేకు కూడా చిరు వేసిన చిందులు ఇప్పుడు ఆన్ లైన్ హల్ చల్ చేస్తున్నాయి. మెగాస్టార్ డ్యాన్సులు వేసేటప్పుడు ఆడిటోరియం దద్దరిల్లిపోగా.. అభిమానులు తీసిన వీడియోలో నెట్లో దర్శనమిచ్చేశాయి. ప్రస్తుతం ఆన్ లైన్ మీడియా - సోషల్ మీడియా - ఛానల్స్ లో చిరు వేసిన డ్యాన్స్ చుట్టే తిరుగుతున్నాయి. తను ఈ వయసులో కూడా ఏ రేంజ్ లో డ్యాన్సులు చేయగలరో ప్రూవ్ చేసేసిన చిరంజీవి.. తన రీఎంట్రీ మూవీ ఎలా ఉంటుందో ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఒక్క పెర్ఫామెన్స్ తో చాలా మంది డౌట్స్ క్లియర్ అయిపోయాయ్. మొత్తానికి బాస్ ఈజ్ బ్యాక్ అన్న ట్యాగ్ కు సరిగ్గా ఆన్సర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

,  ,  ,  ,  ,  ,  ,