Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2015 11:12:03
facebook Twitter Googleplus
Photo

తన 150వ సినిమాకి రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్ లో వున్నారు. ఈ నెలాఖరుకి ఆయన ఇండియాకి తిరిగి వస్తారని తెలుస్తోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన అక్కడ ఏం చేస్తున్నారన్న విషయంపై టాలీవుడ్ లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. బిజినెస్ పనుల నిమిత్తం అక్కడ వున్నారని కొందరు అంటుంటే, కాదు, వేసవి విశ్రాంతి కోసం అక్కడికి వెళ్లారని మరికొందరు చెబుతున్నారు. అయితే, తన తాజా చిత్రంలో మంచి ఫిజిక్ తో కనిపించే నిమిత్తం మేకోవర్ కి అక్కడికి వెళ్లారని కూడా మరో సమాచారం వుంది. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో, తన శరీరంపై ఆయన దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తుండడంతో మంచి ఫిజిక్కుతో అభిమానులను సర్ప్రైజ్ చేసే నిమిత్తం ఆయన అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని అంటున్నారు!

,  ,  ,  ,  ,