Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Mar-2017 13:42:25
facebook Twitter Googleplus
Photo

బాహుబలి విషయంలో ఇప్పుడు ఏం చిన్న మాట అయినా సెన్సేషన్ అవుతోంది. ప్రతీ చిన్న అప్ డేట్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదంతా ఇప్పటివరకూ సినిమాకోసమే ఉపయోగిస్తుండగా.. ఇప్పుడు చిన్నారుల కోసం ఓ మంచి పనికి కూడా ఉపయోగిస్తున్నారు.

బాహుబలితో కలిసి మేక్ ఏ విష్ ఇండియా తరుఫున.. లోపాలతో బాధపడుతున్న చిన్నారులు.. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి కోసం నిధులు సమీకరించేందుకు ఓ ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షలు కలెక్ట్ చేసేందుకు ఉద్దేశించిన ఈ ఫండ్ రైజింగ్ కు రాజమౌళి తన మద్దతు ప్రకటించాడు. 'ఓ చిన్న విరాళం.. పెద్ద మార్పును తీసుకొస్తుంది. సహాయం చేద్దాం.. నవ్వులు పంచుదాం' అంటూ ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం గురించి ట్వీట్ పెట్టాడు రాజమౌళి.

మంచి పని చేసి.. ఓ చిన్నారికి సాయం చేసి.. బాహుబలి గుడీస్ తో పాటు మొదిట రోజు టికెట్స్ గెలుచుకోమంటూ.. నిధులు సమీకరిస్తున్నారు. దీనికి ప్రతీ ఒక్కరూ సాయం చేసే అవకాశం ఉండగా.. 100 రూపాయల నుంచి ప్రతీ ఒక్కరూ విరాళం అందించచ్చు

,  ,  ,  ,  ,