Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2015 11:49:20
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కేలా చేసిన కథానాయకుడు చిరంజీవి. అలాంటి చిరంజీవి చాలా గ్యాప్ తరువాత తన 150 సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నట్టుగా చరణ్ ఖరారు చేశాడు. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ సినిమాకి కథ ఏమిటి అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకి బీవీఎస్ రవి - గోపీమోహన్ కథను అందించారు. చిరంజీవి 150 వ సినిమా కార్యరూపం దాల్చనుందని అభిమానులు ఆనందిస్తోన్న సమయంలో, ఈ సినిమా కథ కాపీ అనే వివాదం తెరపైకి వచ్చింది. ఒక రకంగా ఇది నిరాశా నిస్పృహలను కలిగించేదే.

యూ ఎస్ కి చెందిన వాసుదేవవర్మ అనే రచయిత, ఈ కథ తనదేనంటూ రంగంలోకి దిగాడు. ఆ కథ ఎలా బయటికి వెళ్లిందో కూడా వివరించాడు. అయితే అతని కథ ఏమిటో తమకి తెలియదనీ, తాము సిద్ధం చేసిన కథ మాత్రం కాపీ కాదని బీవీఎస్ రవి .. గోపీ మోహన్ బలంగా చెబుతున్నారు. ఎవరైనా సరే ఈ కథ తమదని భావిస్తే, రైటర్స్ యూనియన్ కి వచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో

,  ,  ,  ,  ,  ,