టాలీవుడ్ లో కొంతమందికి ఫస్టు సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టొచ్చేస్తే.. కొంతమందికి మాత్రం ఓ అరడజను పడ్డాక కాని స్టార్డమ్ రాదు. అదిగో సమంత టైపులో ఫస్టు సినిమాకే స్టార్ అయిపోయినోళ్ళు ఉన్నారు.. అలాగే కాజల్ టైపులో కాస్త లేటుగా.. రకుల్ టైపులో ఇంకా లేటుగా కూడా రావొచ్చు. అలా ఇంకా స్టార్డమ్ ను అందుకోని స్థానంలో ఉన్న ఒకమ్మాయి మన ప్రగ్యా జైస్వాల్.
అప్పుడెప్పుడో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా.. కంచె సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డును అందుకుంది ఈ సుందరాంగి. అయితే కంచె తరువాత ఈ సీతాదేవి రెండేళ్ళు వెయిట్ చేస్తే కాని ఒక కమర్షియల్ సినిమా తన చేతిలో పడలేదు. అదే గుంటూరోడు. ఈ మధ్యలో నాగార్జున ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటించింది కాని.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో దేవుడు సినిమాలో ప్రగ్యా దారబోసిన అందాల గురించి అసలు టాకే రాలేదు. ఇప్పుడిక మంచు మనోజ్ గుంటూరోడుతో వస్తోంది. అందుకే ప్రగ్యా చాలా స్ర్టాంగ్ గా ప్రమోట్ చేస్తోంది కూడా. ఈ కష్టం అంతా కలిసొచ్చి మరి అమ్మడికి ఒక హిట్టొస్తుందా?