Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jan-2017 15:54:35
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ సినిమా ప్రారంభ వేడుకలకు.. ఆడియో ఫంక్షన్స్ కు మెగాస్టార్ చిరంజీవి రావడం సాధారణంగా జరిగేదే. ఇటు చెర్రీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైమ్ కి.. మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో.. ఇన్నాళ్లూ అంతా సాఫీగానే నడించింది. చిరు-చరణ్ లు ఫంక్షన్స్ లో పక్కపక్కనే కనిపించినా.. దాన్ని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేకపోయింది.

కానీ ఇప్పుడు ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ గ్రాండ్ లెవెల్ రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టి మరీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కనే నుంచుని పోజ్ ఇచ్చారు మెగాస్టార్.. మెగా పవర్ స్టార్.

గతంలో ఇలాంటి పోజ్ చూస్తే.. కొడుకు సినిమాకి తండ్రి వచ్చినట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం.. చరణ్ కి అతి పెద్ద కాంపిటీటర్ పక్కన నుంచున్నట్లుగా ఉంది. మెగాస్టార్ స్టామినాను మ్యాచ్ చేయడం కష్టం అంటూ చరణ్.. బ్రూస్ లీ మూవీలో డైలాగ్ చెప్పేస్తాడు కానీ.. మెగాస్టార్ వారసుడిగా ఆ లెవెల్ ను అందుకోవాలని అభిమానులు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ చరణ్ కి ఇప్పుడు తనే పోటీ అయిపోయారు మెగాస్టార్.

,  ,  ,  ,  ,  ,