Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2015 06:57:40
facebook Twitter Googleplus
Photo

కలర్స్ స్వాతి ఇన్నాళ్లు ఏమైంది? అస్సలు కనిపించదేం? ఇటీవలి కాలంలో టాలీవుడ్ ని పూర్తిగా మిస్సయ్యింది. ఎక్కడో ఉన్న తమిళుల్ని మలయాళీల్ని అలరించే పని పెట్టుకుని తెలుగు వారిని పూర్తిగా మర్చిపోయింది ఈ తెలుగమ్మాయ్! అప్పట్లో నిఖిల్ సరసన స్వామిరారా కార్తికేయ చిత్రాల్లో నటించిన తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించనేలేదు.

అయితే ఓ వైపు తమిళ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తెలుగులో 'త్రిపుర' అనే హారర్ థ్రిల్లర్ లో నటించింది. అంజలి నాయికగా గీతాంజలి తెరకెక్కించిన రాజ్ కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతడు చెప్పే లెక్క ప్రకారం త్రిపుర 'గీతాంజలి'ని మించిన హిట్ అవుతుంది. అంతకంటే రెట్టింపు వినోదాన్ని అందిస్తుంది. పైగా స్ర్కిప్టు కొత్తగా ఉన్న సినిమాలను ఈ మధ్యన తెలుగు ప్రేక్షకులు తెగ ఆదరిస్తున్నారు.

అలాగే స్వాతికి ఇది డిఫరెంట్ జోనర్. ఇక్కడ ఫోజులు చూస్తుంటే ఓ పల్లెటూరి అమ్మాయి చుట్టూ తిరిగే ప్రేతాత్మ కథలా అనిపిస్తోంది. స్వాతికి తెలుగుతో పాటు తమిళ్ మలయాళంలోనూ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా అనువాదం రూపంలో రిలీజయ్యే ఛాన్సుంది. ఈ త్రిపుర ఏం చేస్తుందో? వేచి చూడాల్సిందే.

,  ,  ,