Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 12:16:20
facebook Twitter Googleplus
Photo

ఓవర్సీస్ లో రైట్లను అమ్మడం అంటే కేవలం క్రేజ్ కారణంగానే అది జరగుతుంది. అందుకే బాహుబలిః ది బిగినింగ్ సినిమాను ఏకంగా 9 కోట్లు పెట్టి కొన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఓవర్సీస్ కలక్షన్ల హవా అంతగా లేదు. కాని ఈయన తిరిగి సినిమాల్లోకి వచ్చేసరికి.. ఖైదీ నెం 150 రిలీజుకు రెడీ చేసే సమయానికి.. ఏకంగా 1 మిలియన్ డాలర్ క్లబ్స్ అంటూ ప్రెస్టీజియస్ క్లబ్బులే తయారయ్యాయ్.

ఒక ప్రక్కన సీన్ ఇలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం రావడంతోనే అందరికీ షాకిచ్చారు. తన మెగా ఎంట్రీ అంటే అసలు ఏ రేంజులో ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఇప్పుడు ''ఖైదీ నెం 150'' సినిమా అమెరికా రైట్లను ప్రముఖ పంపిణీదారుడు క్లాసిక్ సినిమాస్ వారు.. ఏకంగా 13.5 కోట్లను వెచ్చించి కొన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సర్దార్ సినిమాకు 10 కోట్లు.. బ్రహ్మోత్సవం కు 13 కోట్లు.. జనతా గ్యారేజ్ 7.25 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ బీట్ చేస్తూ ఇప్పుడు 13.5 కోట్లకు అమ్ముడుపోయి.. మెగాస్టార్ చిరు కొత్త రికార్డు నెలకొల్పినట్లే.

బాహుబలి 2.. తమిళ ధియేట్రికల్ రైట్లు తెలుగు తమిళం మలయాళం ఓవర్సీస్ రైట్లను కలిపి 95 కోట్లకు అమ్మడం వలన.. బ్రేకప్ ఏంటనేది ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకవేళ తెలుగు ఓవర్సీస్ రైట్లకు 25-30 కోట్లు అనుకున్నా కూడా.. ఒక సాధారణ కమర్షియల్ సినిమా ఇలా బాహుబలి 2 తరువాతి రేంజులో ఉండడం మాత్రం చాలా ఛాలెంజింగ్ విషయమే. దీనినిబట్టి చూస్తుంటే మెగాస్టార్ పై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో చూస్కోండి

,  ,  ,  ,  ,  ,  ,