Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2015 13:47:15
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్ లో ఐటెం సాంగ్ చేస్తోంది రాయ్ లక్ష్మీ. కేవలం డ్యాన్స్ లకే పరిమితం కాకుండా.. కొన్ని మంచి సీన్స్ కూడా చేస్తున్నందుకు బోలెడు సంతోషించింది కూడా. యాక్టింగ్ లోనే కాదు.. స్టెప్పులోనూ మంచి గ్రేస్ చూపించడం లక్ష్మీ స్పెషాలిటీ. ఈ విషయం ఇప్పటికే ప్రూవ్ కాగా... తన ట్యాలెంట్ ఏంటో సర్దార్ లో చూపిస్తానని సవాల్ కూడా చేసింది.

ఇప్పుడీ భామకి నరాల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్నపుడు హఠాత్తుగా కాళ్లు నొప్పులు రావడంతో.. హడావిడిగా ఆస్పత్రికి తరలించారట యూనిట్. అక్కడ రకరకాల టెస్టులు చేశాక.. ఆపరేషన్ తప్పదని తేల్చి చెప్పారట డాక్టర్లు. నరాలు పెనవేసుకుని ముడి పడ్డంతోనే ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తనే చెప్పింది.

ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ తో పాటు జూలియట్ అనే చిత్రంలోనూ రాయ్ లక్ష్మీ యాక్ట్ చేస్తోంది. హైద్రాబాద్ లో షూటింగ్ సమయంలో కాళ్ల నొప్పులు రాగా.. ముంబైలో ఆపరేషన్ చేశారు. మొత్తానికి ఇప్పుడు కోలుకుంది లెండి. అయినా డ్యాన్సులు బాగా చేయడమంటే.. నరాలు మెలికలు పడేలా చేసేస్తారా ఎవరైనా ? కెరీర్ ముఖ్యమే కానీ.. హెల్త్ అంతకంటే ఇంపార్టెంట్ కదా.. కాస్త కేర్ తీసుకో రాయ్ లక్ష్మీ.

,  ,