Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Aug-2016 11:06:18
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వచ్చినా వాళ్ళకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు, ప్రోత్సాహం తప్పకుండా ఉండాల్సిందే. చిరంజీవి కూడా ఇప్పటి వరకూ వచ్చిన అందరు మెగా హీరోల్ని అలానే ముందుకు నడిపారు. ప్రస్తుతం ఆయన ?అల్లు శిరీష్? కెరీర్ పై దృష్టి పెట్టారు. మొదటి రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా హిట్ సాదించాలని చాలా పట్టుదలగా ఉన్న శిరీష్ దర్శకుడు ?పరశురామ్? దర్శకత్వంలో ?శ్రీరస్తు శుభమస్తు? చిత్రాన్ని చేశాడు.
ఇప్పటి వరకూ విడుదలైన ట్రైలర్, టీజర్స్, ఆడియో అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. వీటికి తోడు చిరు కూడా మొన్న జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తాజాగా ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీనింగ్ ను చూసి సినిమా చాలా బాగుందని శిరీష్ ను, దర్శకుడిని అభినందించారు. దీంతో చిత్రం ఖచ్చితంగా విజయం సాదిస్తుందని శిరీష్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఇకపోతే శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,