Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 13:20:22
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ హీరోగా నటించగా, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ?సరైనోడు? సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో ఈ ఏడాది భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలకు తగ్గట్టే మొదటి వారాంతం మంచి కలెక్షన్స్‌ని రాబట్టింది. ముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ అయిన మాస్‌ను సినిమా బాగా ఆకట్టుకుంటుంది. మొదటి వీకెండ్ ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి.
నైజాం ఏరియాలో ?సరైనోడు? సినిమా మూడు రోజుల్లో కలుపుకొని 7.10 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేస్తుందన్న ప్రచారంతో వచ్చి, ఆ విషయంలో విజయం సాధించింది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్ థ్రెసాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,  ,