Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 12:27:24
facebook Twitter Googleplus
Photo

ప్రతీ సంవత్సరం 80లలో ఫిలిం ఇండస్ర్టీలకు వచ్చిన సౌత్ స్టార్లందరూ కలసి ఎక్కడో ఒక చోట ఒక థీమ్డ్ పార్టీ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సుహాసినీ అండ్ రాధిక స్టార్ట్ చేసిన ఈ ఈవెంట్ ను ప్రతీఏటా క్రమం తప్పకుండా జరుపుతున్నారు. ఈ ఏడాది వీరి రీయునియన్ ఈవెంట్ చైనాలో పెట్టుకున్నారు. అక్కడున్న అనేక నగరాలను ఈ గ్యాంగ్ అంతా చుట్టేస్తున్నారు.

చైనాలో బీజింగ్ తరువాత షాంగాయ్.. గాంజో వంటి నగరాల్లో ఇప్పుడు మెగాస్టార్ చిరు.. ఆయన సతీమణి సురేఖ.. మిగతా నటీనటీలుతో కలసి చెక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అక్కడ చూస్తే మనకు రాధిక.. సుహాసిని.. లిజి.. భాగ్యరాజా.. ఖుష్బూ.. సరిత.. తదితర నటులు కనిపిస్తున్నారు. గతంలో దర్శకుడు శంకర్ ఐ సినిమా కోసం చుట్టొచ్చిన లొకేషన్ల గురించి వీరు తెలుసుకుని.. అక్కడ పర్యటిస్తున్నారట. మొత్తానికి ప్రతీఏటా జరిపినట్లే ఈ ఏడాది కూడా చైనాలో ఆ విధంగా రచ్చ చేస్తున్నారనమాట. అయితే ఈ గ్యాంగులో బాలయ్య అండ్ వెంకీ కూడా ఉండాలి కాని.. ఎందుకో వారు ఇంకా జాయినవ్వలేదనకుంట.

ఇకపోతే చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కోసం గుబురుగా గెడ్డం పెంచుతున్నారని అనిపిస్తోంది.

,  ,  ,  ,  ,