Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2017 12:18:58
facebook Twitter Googleplus
Photo

నిన్నే పెళ్ళాడుతా సినిమాకు ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్న కృష్ణ వంశీ ఆ తరువాత సింధూరం అంతఃపురం మురారి ఖడ్గం లాంటి సూపర్ హిట్ సినిమాలును అందించాడు. కాకపోతే చందమామ సినిమా తరువాత కృష్ణ వంశీ కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అనే చెప్పాలి. ఇప్పుడు తన సత్తాను అంతా కూడదీసుకొని నక్షత్రం సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.

ఇకపోతే ఇదే సినిమాలో విపరీతమైన అందాలు ఆరబోసిన రెజీనా కసాండ్రా.. కృష్ణవంశీకి ఓరకంగా పెద్ద హెల్పే చేస్తోంది. నక్షత్రం సినిమా గురించి మాట్లాడాలి అంటే కృష్ణవంశీ గారి గురించే చెప్పాలి. నటులు అన్నాక ఆయన సినిమాలో ఒక్కసారైన నటించాలి అని నాకు చాలామంది చెప్పారు. నేను ఆయనతో పని చేశాక అది అర్ధమైంది. కృష్ణవంశీ గారు హిరోయిన్లని చాల అందంగా చూపిస్తారు అని తెలుసు. ఈ సినిమాలో ఒక పాట ఉంది. నాపై ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు నాకు ఏమి అనిపించలేదు కానీ స్క్రీన్ పై చూసినప్పుడు మాత్రం నా అందాన్ని నేనే నమ్మలేకపోయాను. నేను ఇంత అందంగా ఉన్ననా అని నాకే సందేహం వచ్చింది అంటూ మురిసిపోయింది రెజీనా. లాయిరే లాయిరే పాటన్నా.. పెదవికి నువ్వంటే పాటన్నా నాకు చాలా ఇష్టం అంటోంది అమ్మడు. ఆ రెండు పాటల్లోనే ఈ భామ మ్యాగ్జిమం అందాలను దారబోసిందిలే.

నిజానికి ఇదివరకు ఒకసారి రా రా కృష్ణయ్య సినిమాలో కూడా రెజీనా ఈ రేంజులోనే అందాలను ఆరబోసింది. అయితే అంతందం అప్పట్లో పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దానికి డబుల్ అందాలను మళ్లీ సందీప్ కిషన్ సరసనే ఆరబోయేడం ఒకెత్తయితే.. కృష్ణవంశీ డైరక్షన్లో దారబోయడం ఇంకో ఎత్తు.

,  ,  ,  ,  ,