Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 12:50:17
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సినిమాపై చాలానే వార్తలు వచ్చేస్తున్నాయి. మెగాస్టార్ తో సినిమా ఓకే చెప్పించేసుకున్నారని.. చిరు 151వ సినిమాకి అల్లు అరవింద్ తో కలిసి నిర్మాణం చేపడతారనే టాక్ ఉంది. మరోవైపు త్రివిక్రమ్ కథతో 152 తీసే చాన్సుందని కూడా టాక్ ఉంది. అయితే వీటిపై మెగా క్యాంపులో టాక్ వేరేలా ఉంది.

నిజానికి మెగా 150నే తాను ప్రొడ్యూస్ చేస్తానని అశ్వినీదత్ అడిగినా.. తన సొంత బ్యానర్ కే మొగ్గారు మెగాస్టార్. అలాగే 151వ చిత్రాన్ని అల్లు అరవింద్ కి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చేసేందుకు ఓకే చెప్పారు. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటితో.. సినిమా చేసేందుకు చిరు కూడా ఆసక్తిగా ఉన్నారు. అందుకే తన 152వ చిత్రాన్ని అశ్వినీ దత్ కి చేసే అవకాశాలున్నాయని టాక్ వచ్చింది. లేకపోతే 151లోనైనా అశ్వినీదత్ పార్టనర్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. కాని ఇదంతా కేవలం రూమర్సేనట. ఎందుకంటే ప్రస్తుతం 150 పూర్తి చేయడం.. ఆ తరువాత 151 చేయడం మాత్రమే చిరంజీవి ప్లానింగులో ఉన్నాయి కాని.. ఇంకా తక్కిన విషయాలు ఏమీ డిస్కస్ కూడా చేయలేదట.

ఒకపోతే త్రివిక్రమ్ తో చిరంజీవి అనే న్యూస్ పై స్పందించిన చిరు సన్నిహితులు.. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులతో వరుసగా సినిమాలు చేయాల్సి ఉన్న త్రివిక్రమ్.. అప్పటివరకూ కొత్త సినిమా చేసే అవకాశం లేకపోవడంతో.. ఈలోపు చిరంజీవి ప్లాన్స్ వేరేగా వెళ్ళే ఛాన్సుంది అంటున్నారు. సో.. అటు అశ్వినీదత్ ఇటు త్రివిక్రమ్.. ఇలా ఎవ్వరికీ ఓ రకంగా మెగాస్టార్ జెండా ఊపలేదనే చెప్పాలి మనం.

,  ,  ,  ,  ,