Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 17:39:44
facebook Twitter Googleplus
Photo

మామూలుగా కొంతమంది కుర్ర హీరోలకు.. ఇలా పిలిస్తే అలా స్టార్ హీరోయిన్లు డేట్లు ఇచ్చేస్తారు అనుకుంటాం. అయితే అలా ఏమీ ఉండదంటున్నారు ''ఒక్క అమ్మాయి తప్ప'' టీమ్. సాక్షాత్తూ సందీప్ కిషన్ మావయ్య చోట. కె.నాయుడు రంగంలోకి దిగినా కూడా.. అసలు ఒక్క హీరోయినంటే ఒక్కరు కూడా డేట్లు ఇవ్వలేదట.

ముందుగా ఈ సినిమా కథ చెప్పి.. రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా చేయమని అడిగారట. సినిమాలో హీరోయిన్ పాత్ర చిన్నదే కాని.. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఒక చిన్న ఎలిమెంట్.. అంటూ ఆమెకు ఎక్సప్లెయిన్ చేశారట. అయినాసరే రకుల్ ఒప్పుకోలేదట. డేట్లు లేవు అని చెప్పిందట. ఇక పేర్లు చెప్పకుండా.. చోటా కె నాయుడు చాలామంది స్టార్ హీరోయిన్లు ఇలాగే చేశారు అన్నాడు. ''అసలు టాలీవుడ్ లో మేం అడగని హీరోయిన్ లేదనుకోండి. ఆఖరికి నిత్యా మీనన్ ఒప్పుకుంది. నిజానికి తెలుగు సినిమాలకు ఒక మాంచి హీరోయిన్ అంటే సౌందర్య. ఆ తరువాత బంగారం సమంత.. తరువాత ప్లాటినం నిత్యా మీనన్. క్యారెక్టర్ చిన్నదైనా కూడా.. నాకు నచ్చిందీ క్యారెక్టర్. నేను చేస్తున్నా అని చెప్పింది నిత్యా. అమ్మాయిలో కాస్త సెల్ఫిష్ నెస్ తక్కువ'' అంటూ చోటా చెప్పాడు.

ఇకపోతే నిత్యా మీనన్ కు చిన్న సినిమా రేంజు పేమెంట్ మాత్రమే ఇచ్చినా.. ఆమె ఒక పెద్ద సినిమాను చేసినట్లే చేసిందని ఆయన హింటిచ్చారు. మొత్తానికి నిత్యా ఒక డార్లింగ్ లా మారిపోయిందట.

,  ,  ,  ,  ,