Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Apr-2016 12:36:14
facebook Twitter Googleplus
Photo

చిన్నారి పెళ్లికూతురు ఆనంది పాత్రధారి నటి ప్రత్యూష సూసైడ్ ఉదంతం పలు సందేహాలకు తావిచ్చేలా ఉంది. శుక్రవారం తన సొంతింట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్న స్థితిలో ఆమెను గుర్తించటం.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించటం.. అప్పటికే ఆమె చనిపోయి ఉండటం తెలిసిందే.

తొలుత ఆమెది ఆత్మహత్యగా భావించినప్పటికీ.. మృతదేహాన్ని దగ్గర నుంచి చూసిన వారు ఆమె సూసైడ్ చేసుకొని ఉండదని.. పక్కా ప్లాన్ తో హత్య చేసి ఉంటారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఆమె మృతదేశం మీద గాయాలు ఇదే విషయాన్ని చెబుతున్నట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష కానీ సూసైడ్ చేసుకొని ఉంటే ఆమె ముఖం మీద గాయాలు ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ.. అందుకు భిన్నంగా గాయాలు ఉండటం.. సూసైడ్ లెటర్ ఏదీ దొరక్కపోవటం సందేహాలకు తావిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రత్యూష లవ్వర్ గా చెబుతున్న మరో నటుడు రాహుల్ సైతం మిస్ కావటం.. ఆమె చనిపోయిన వార్త బయటకు వచ్చిన తర్వాత నుంచి పత్తా లేకుండా పోవటం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రత్యూష స్నేహితులు సైతం ఆమెది ఆత్మహత్య అయి ఉండదని చెబుతూ.. రాహుల్ మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అతనిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సూసైడ్ చేసుకోవటానికి ముందు రాహుల్ కు ప్రత్యూష ఒక మెసేజ్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంలో వినిపిస్తున్న చాలా ప్రశ్నలకు పోస్ట్ మార్టం నివేదిక సమాధానం చెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ రిపోర్ట్ కోసమే పోలీసులు ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,